AP DGP : ఏపీ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా శంఖబ్రత...బాధ్యతల స్వీకరణ !

0

రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో నెలకొంటున్న శాంతి భద్రతల సమస్యలు, వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆయన స్థానంలో.. ఆంధ్రప్రదేశ్‌ నూతన ఇన్‌ఛార్జి డీజీపీగా (INCHARGE DGP) ఐపీఎస్‌ అధికారి శంఖబ్రత బాగ్చి నియమించింది. కాగా ఆయన ఈ రోజు ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా (INCHARGE DGP) భాద్యతలు స్వీకరించారు. ఏపీ నూతన డీజీపీ నియామకం పై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. డీజీపీ (DGP)పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్‌, హరీష్‌ కుమార్‌ గుప్త అనే ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ పేర్లను పంపించినట్టు తెలిసింది. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డికి సోమవారం నాడు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !