అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. ఆరోపణలు, ప్యత్యారోపణలతో ట్విట్టర్ హ్యాండిల్స్ హోరెత్తుతున్నాయి. ఇక, తాజాగా ఏపీలో ఓ ఐఏఎస్ అధికారి పరిస్థితిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. జగన్ సీఎంవోలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ట్వీట్ స్క్రీన్ షాట్ ఫొటోను జత చేశారు.
ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పోస్ట్
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తానూ ఇబ్బందులు పడ్డానని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో #LANDTITILEINGACT హ్యాష్ ట్యాగ్‌తో ఆయన పోస్ట్ చేశారు. ‘‘నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండా తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం’’ అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.
జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024