AP POLLS : పోలింగ్‌కి కౌంట్‌డౌన్‌...మొదలైన ప్రలోభాల పర్వం !

0

శాశనసభతో పాటు లోక్‌ సభ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. పోలింగ్‌కు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్‌ పెంచడంతో పాటు ప్రలోభాలకు తెరతీశాయి . ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్‌లో కూటమీ, వైసీపీ పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూకుడు మీద ఉన్నా వైసీసీ సంక్షేమాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఎవరికీ వారే ఆయా నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు, పాదయాత్రలు చేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ప్రాధేయపడటం ఆసక్తి కరంగా మారింది. ఇదిలా ఉండగా ఈ పర్యాయం లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, పవన్‌కళ్యాణ్‌ నిలబడుతున్న పిఠాపురం గెలుపోటములు కోసం ఎంతో ఉత్కంఠ నెలకొంది.

మొదలైన ప్రలోభాల పర్వం

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే ప్రచారం పేరుతో  పార్టీ అభిమానులు, అనుచరులు మందు, బిర్యానీ, డబ్బులతో గత నెల రోజులుగా ఓటర్లను ఆకర్షించే పనిలో ఉఆన్నరు. ఆయా ప్రాంతాల పరిధిలో తమకు విశ్వాసంగా ఉండే నాయకులు, అనుచరులతో డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. ఓటుకి రూ. 3000/` అధికార, కూటమి పక్ష నాయకులు పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు అధికారులు తనిఖీలు చేపడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న నగదును పట్టుకుంటున్నా వారి కండ్లు గప్పి గమ్యస్థానాలకు చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల నిఘా ఉంటుందనే ముందే ఊహించిన పార్టీల నాయకులు ముందుగానే తమకు కావాల్సిన చోట్లకు నగదు తరలించి పంపకాలు జరిపేందుకు చూస్తున్నారని తెలిసింది. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై రోడ్లపై చెకింగ్‌ లు మరింత తీవ్రతరం చేశారు .

మద్యం డంప్‌ ...?

ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం పోలింగ్‌ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు చేసిన ఆదేశాలతో అన్ని పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారు. ముందుగానే మద్యం దుకాణాల నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి డంప్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఏ ఎన్నికలైనా మద్యం, మాంసాహారం, నగదు పంపిణీలది ప్రధాన పాత్ర కావడం , అవి లేనిదే నాయకులు, కార్యకర్తలు ముందుకు రాకపోవడం తో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి కొరత రాకుండా నాయకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు . ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు పోటా పోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !