#JR NTR : మహిళ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్‌... హైకోర్టుని ఆశ్రయించిన తారక్‌ !

0

ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర, వార్‌ 2 సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కూడా రాబోతుంది. అభిమానులు ఎన్టీఆర్‌ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎయిర్‌ పోర్ట్స్‌లో రెగ్యులర్‌గా కనిపించి ఎన్టీఆర్‌ వైరల్‌ అవుతున్నారు. ఎప్పుడూ సినిమాలతో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే ఎన్టీఆర్‌ తాజాగా ఓ కేసు విషయంలో వైరల్‌ అవుతున్నారు.

ప్లాట్‌ కొనుగోలు సమయంలో ఎం జరిగింటంగే...!

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 75లో ఉన్న ఓ ప్లాట్‌ విషయంలో ఎన్టీఆర్‌ కోర్టుకెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుండి ఎన్టీఆర్‌ ప్లాట్‌ కొనుగోలు చేశారు. అయితే అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్‌ గెజ్‌ ద్వారా లోన్స్‌ తీసుకుంది గీతలక్ష్మి కుటుంబం. 3, 4 బ్యాంక్‌ల నుండి ఫేక్‌ డాక్యుమెంట్స్‌ పెట్టి గీత లక్ష్మి లోన్‌ పొందింది. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్లాట్‌ అమ్మే సమయంలో ఈ విషయాన్ని దాచిపెట్టింది గీత లక్ష్మి. ప్లాట్‌ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్‌ గేజ్‌ లోన్‌ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు చెప్పింది గీత లక్ష్మి. చెన్నైలో ఒక బ్యాంక్‌లో లోన్‌ క్లియర్‌ చేసి డాక్యుమెంట్స్‌ తీసుకున్నారు తారక్‌. 2003 నుండి ఎన్టీఆర్‌ ఈ ప్లాట్‌ ఓనర్‌ గా ఉంటున్నాడు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో ఈ ప్లాట్‌ విషయంలో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్‌ మేనేజర్లు ప్రయత్నించడంతో బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్‌పై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్‌ నమోదు చేసారు. తాజాగా DRT( Debt Recovery Tribunal) జూనియర్‌ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఆర్డర్‌ రావడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు ఎన్టీఆర్‌. జూన్‌ 3 లోపు DRT డాకెట్‌ ఆర్డర్‌ సబ్మిట్‌ చేయమని హైకోర్టు ఆదేశించింది. దీనిపై జూన్‌ 6న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. మరి ఇప్పటికైనా ఆ ప్లాట్‌ వివాదం ముగుస్తుందా లేదా చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !