దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కావేరి బవేజా డిస్మిస్ చేశారు. బెయిల్ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసుకుంటూ వచ్చింది కోర్టు. సోమవారం తీర్పులో భాగంగా బెయిల్ నిరాకరించింది. పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదించాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపాయి. ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మద్యం పాలసీ కేసులో కావాలనే తనను ఇరికించారని కవిత ఆరోపించారు. ఈడీ, సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరించినా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తనను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఎప్పటికైనా నిర్ధోషిగా బయటకు వస్తానని ఇటీవల కవిత మాట్లాడారు.సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరో సారి కవితకు చుక్కెదురైనట్లు అయింది.