స్టార్ హీరోలు, హీరోయిన్స్ గురించిన చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ధనుష్, నయనతార, అనిరుద్, త్రిష లాంటి స్టార్‌కు సంబందించిన వ్యకిగత రహస్యాలు సుచీ లీక్స్ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి .. తాజాగా మరోసారి సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా స్టార్ హీరో ధనుష్ గురించి ఆయన మాజీ భార్య గురించి కామెంట్స్ చేసింది. ధనుష్ గే అంటూ చెప్పుకొచ్చింది. గతంలో సుచీ లీక్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి చాలా మంది సెలబ్రెటీల సీక్రెట్స్ బయటకు వచ్చాయి. ప్రయివేట్ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. సుచీ లీక్స్ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ ను ఇరుకున పెట్టింది. కమల్ హాసన్ డ్రగ్స్ వాడాడు అంటూ సంచలనానికి తెరలేపింది సుచిత్ర. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కొకైన్ వాడినట్లు ఆరోపించింది సుచిత్ర. సింగర్ సుచిత్ర ఇటీవల కమల్ హాసన్ తన పార్టీలలో కొకైన్ వాడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌లో చిక్కుకుందని ఆమె చెప్పుకొచ్చింది. దాంతో రచ్చ మొదలైంది.అయితే ఈ ఆరోపణల పై విచారణ జరిపించాలని బీజేపీ కోరుతుంది. కమల్ హాసన్ కొకైన్ వాడారు అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పోలీసులను కోరారు. దాంతో ఈ వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ మేరకు నారాయణన్ తిరుపతి ఆయన ఎక్స్‌లో ( ట్విటర్ లో) పోస్ట్ చేశాడు. ‘ సుచిత్ర చేసిన ఆరోపణల పై తిరుపతి తీవ్రమైన విచారణకు పట్టుబట్టారు. సుచిత్ర చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఒకవేళ ఆమె ఆరోపణలో నిజమంటే కమల్‌ను ప్రశ్నించాలని, పార్టీలలో డ్రగ్స్ తీసుకున్నారో లేదో గుర్తించాలని పోలీసులను కోరారు.
கமலஹாசன் மீது நடவடிக்கையா? pic.twitter.com/xZhHPvjLCE
— Narayanan Thirupathy (மோடியின் குடும்பம்) (@narayanantbjp) May 15, 2024