యానిమల్ సినిమాలో తన అందాలతో ఆడియన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా.. గ్లామర్‌తో రచ్చ చేసి ఆడియన్స్‌ని తన వైపుకి తిప్పుకుంది. ఈ ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అందుకే త్రిప్తి చేయబోయే సినిమాలపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే త్రిప్తి దిమ్రీ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. త్రిప్తి దిమ్రీ త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నటించనున్నారట. అయితే అది హీరోయిన్ గా కాదు. ఒక ఐటెం సాంగ్ కోసమట. అవును.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా.. ఊఊ.. అంటావా.. అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం కోసం ఊ అంటావా మించిన పాటను సెట్ చేశాడట దేవి శ్రీ ప్రసాద్. ఈ పాటలో అల్లు అర్జున్ తో చిందేయడానికి యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ని అనుకుంటున్నారట మేకర్స్. ప్రెజెంట్ సిచువేషన్ లో త్రిప్తి అయితేనే యూత్ లో ఆ క్రేజ్ వస్తుంది అని భావిస్తున్నారట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. యానిమల్ సినిమాతో తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసిన ఈ బ్యూటీ ఈ ఐటం సాంగ్ లో ఏ రేంజ్ లో చెలరేగిపోతుందో చూడాలి.