వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ.. విలక్షణమైన నటనతో మెప్పిస్తూ సినీప్రియులకు దగ్గరైన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ‘హను-మాన్’తో అందర్నీ అలరించిన ఆమె ఇప్పుడు ‘శబరి’గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు వరలక్ష్మి లేడీ ఓరియెంటెడ్ గా ‘శబరి’ ( Sabari Movie Review )సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో నేడు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చిత్ర కథేంటి? సినిమా ఎలా ఉంది ? ఇప్పుడు చూద్దాం.
కథేంటంటే
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన భర్త అరవింద్(గణేష్ వెంకట్ రామన్)ని వదిలేసి కూతురు(బేబీ నివేక్ష)తో సింగిల్ గా బతుకుతుంటుంది. ముంబై నుంచి విశాఖపట్నం వచ్చి ఫ్రెండ్ వద్ద ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్(శశాంక్)ని కలుస్తుంది. అతని సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డాన్స్ ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. ఆ జాబ్ చేస్తూ సిటీకి దూరంగా ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఇల్లు తీసుకొని ఉంటుంది.అయితే అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో సంజనకు ఓ చిత్రమైన సమస్య ఎదురవుతుంది. సైకోగా మారిన సూర్యం (మైమ్ గోపి)( Sabari Movie Review ) అనే వ్యక్తి రియా తన బిడ్డని.. ఆ పాపను తనకు అప్పగించాలని.. లేదంటే చంపేస్తానంటూ ఆమె వెంటపడటం మొదలు పెడతాడు. మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది?కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది?రియా నిజంగా తన కూతురా?కాదా?సైకో సూర్యం నుంచి సంజన ప్రాణానికి వచ్చిన ముప్పేంటి? అతనికి అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా?అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అతన్నుంచి తప్పించుకోవాలని ట్రై చేసే క్రమంలో సంజన గాయాలపాలవుతుంది. పోలీసులకు ఈ విషయం చెప్పగా వాళ్ళు విచారణ చేస్తే సూర్య ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు తన భర్త అరవింద్ కూతురిని తనకు ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు. అసలు సంజన అరవింద్ ని ఎందుకు వదిలేసింది? సంజనని చంపడానికి వెంబడిస్తున్న సూర్య ఎవరు? కూతురుని కాపాడుకోడానికి సంజన ఏం చేసింది? సంజన గతం ఏంటి? రియాకి సూర్యకి సంబంధం ఏంటి? లాయర్ రాహుల్ సంజనకు ఎలాంటి సాయం చేశాడు అన్నది సినిమా ( Sabari Movie Review ) చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే
కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసిన సాహసోపేతమైన ప్రయాణమే క్లుప్తంగా ( Sabari Movie Review ) ఈ చిత్ర కథాంశం. దీన్ని దర్శకుడు ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముస్తాబు చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభంలోనే ఓ మానసిక రోగుల ఆశ్రమం నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని ఇద్దరిని చంపి తల్లి కూతురు కోసం వెతుకుతున్నట్టు చూపించి ఆసక్తి కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో కథని మొదలుపెట్టడానికి, పాత్రల పరిచయానికి కొంచెం ఎక్కువ టైం తీసుకోవడంతో మొదట్లో సాగతీతగా ఉంటుంది. సంజన ఎందుకు తన భర్తకి దూరంగా ఉంటుంది అనేది సస్పెన్స్ మైంటైన్ చేయగలిగారు. జాబ్ కోసం తిరిగే సన్నివేశాలు కూడా ఎక్కువసేపు చూపించారు. సినిమాలో మళ్ళీ సూర్య పాత్ర ఎంట్రీ నుంచి ఆసక్తిగా సాగుతుంది. అయితే కథలోని కొన్ని ట్విస్ట్‌లు థ్రిల్ చేసేలా ఉన్నా.. సినిమాని నడిపించిన తీరు అంతగా మెప్పించదు. స్క్రిప్ట్‌లో సరైన బలం లేకపోవడం.. స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటం.. కథలో సరైన సంఘర్షణ, భావోద్వేగాలు కనిపించకపోవడం ఫలితాన్ని దెబ్బతీసింది. ప్రథమార్ధంలో సింహభాగాన్ని పాత్రల పరిచయంతోనే సరిపెట్టాడు దర్శకుడు. సంజన గతం.. తల్లి ప్రేమకు దూరమై చిన్నతనంలో ఆమె పడిన వేదన.. అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అతని చేతిలో మోసపోయి ఇంటి నుంచి బయటకు రావడం.. ఈ నేపథ్యమంతా బోరింగ్. అరవింద్ తన కూతుర్ని అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన దగ్గర్నుంచే కథ కాస్త వేగం పుంజుకుంటుంది.ఇక ఎప్పుడైతే సైకో సూర్యం పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ సంజనను సూర్యం వెంటాడటం.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే విషమ పరిస్థితులు అన్నీ థ్రిల్‌కు గురిచేస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా చేస్తాయి. కానీ, ఆ ఆసక్తి సెకండాఫ్ మొదలైన కాసేపటికే ఆవిరైపోతుంది. సూర్యం పాత్రలో ఉన్న ఓ ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అక్కడి నుంచే సాగే కథనమంతా గాడితప్పిన బండిలా సాగుతుంది. కొన్ని సన్నివేశాలతో మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమా గుర్తొస్తుంది. ఆరంభంలో కాస్తోకూస్తో భయపెట్టిన సూర్యం పాత్ర క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా తేలిపోయింది. శబరి( Sabari Movie Review ) సినిమాలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్నా డైరెక్టర్ కొంచెం తడబడ్డట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే
వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగిల్ మదర్‌గా సంజనా పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ సహజమైన నటనతో ఆకట్టుకుంది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో తనదైన నటనతో కట్టిపడేసింది. కథలో ( Sabari Movie Review ) బలం లేకున్నా.. సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నం చేసింది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రే సినిమాలో కాస్త థ్రిల్ పంచుతుంది. అరవింద్‌గా గణేశ్ వెంకట్రామన్, రియాగా నివేక్షతో పాటు సినిమాలోని మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. అనిల్ ఎంచుకున్న కథలో కొంత కొత్తదనమున్నా.. దాన్ని చక్కటి థ్రిల్లర్‌గా మలచుకోవడంలో తడబడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే చాలా వీక్‌గా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శబరి అనే పేరు ఎందుకు పెట్టారో అసలు అర్థం కాదు. లాజిక్‌కు దూరంగా ఉండే అంశాలు సినిమాలో చాలా కనిపిస్తాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకి( Sabari Movie Review ) ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలున్నాయి. తల్లి ,కూతుళ్ళ అనుబంధంతో ఉన్న రెండు పాటలు మాత్రం పరవాలేదు. ఎడిటింగ్ పరంగా సినిమాని ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేది. కథ కొత్తగా రాసుకున్న కథనం ఇంకొంచెం మారిస్తే బాగుండు అనిపిస్తుంది,. దర్శకుడిగా అనిల్ పర్వాలేదనిపించారు. ఇక సినిమాకి నిర్మాణ పరంగా మాత్రం కొత్త నిర్మాత ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.