Nellore City : నెల్లూరు సిటీలో నారాయణదే హవా !

0

నెల్లూరు సిటీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక కీలక నియోజకవర్గం. గత రెండు దఫాలుగా వైసీపీకి కంచుకోటలా నిలిచిన నియోజకవర్గం. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన పొంగూరు నారాయణ స్వల్ప మెజారీటీలో ఓడిపోయారు. మరోసారి మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదే స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...అనేది ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది.

అంతకు అంత నారాయణకు పెరుగుతున్న ఆదరణ !

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ఏకపక్షమేననని.. పరిస్థితులు అన్నీ నారాయణకు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధికి ప్రతిరూపమైన నారాయణను కాదని అనిల్‌కుమార్‌ని గెలిపించి తప్పు చేశామని ఓటర్లలో వ్యక్తం అవుతోంది. మరోవైపు నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు లేక కళతప్పింది. డ్రైనేజ్‌ వ్యవస్థ పూర్తికాకపోవటం, సీసీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, వర్షపు నీరు సజావుగా వెళ్ళే మార్గం లేక రోడ్లపైనే నీళ్ళు నిలిచిపోవటంతో ప్రజలు అసౌకర్యానికి గురువుతున్నారు. దీంతో ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఈ పరిస్థితులన్నీ నారాయణకు ప్లస్‌గా మారాయి. మరో వైపు ఆర్థికంగా సంపన్నుడు కావటంతో ఖర్చుకు వెనుకాడటం లేదు. సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధి చేసినా ఓడిపోయారనే సానుభూతి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. రాజధాని భూముల్లో కక్షసాధింపు చర్యలతో జగన్‌ ఇబ్బంది పెట్టినా ఎక్కడా తగ్గకుండా నెల్లూరును అంటిపెట్టుకుని ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం నారాయణకు కలిసి వచ్చే అంశాలు. పేపరు లీకేజీ కేసులో అక్రమంగా నారాయణ పేరు చెప్పించి నారాయణను ఇబ్బంది పెట్టడంపైనా జనంలో సానుభూతి వ్యక్తం అవుతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవటంతో మరింత కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ , రెడ్డి, కాపు సామాజిక వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థికి 53% పైగానే ఓట్లు రాబోతున్నాయి అని సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఏదీ ఏమైనా ఈసారి పొంగూరు నారాయణ విజయం నల్లేరు నడకే అని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

అనిల్‌కుమార్‌పై వ్యతిరేకత..

2014, 19 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్‌ కేబినెట్‌లో మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ నగరాభివృద్ధిని గాలికి వదిలేశారు. గోతులు పడిన రోడ్లను కూడా బాగుచేయించలేకపోయారన్నది ప్రజల అభిప్రాయం. తానేమీ చేయకపోగా, నారాయణ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సైతం నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నారాయణ హయాంలో నిర్మించిన 20వేల పైచిలుకు టిడ్కో ఇళ్లను ఐదేళ్లు గడిచినా ప్రజలకు ఇవ్వలేదు. 90శాతానికి పైగా పూర్తయిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, డ్రిరకింగ్‌ వాటర్‌ స్కీమ్‌లను పూర్తి చేయలేదు. దీనికితోడు అనిల్‌ వ్యవహారశైలితో వైసీపీలో కుమ్ములాటలు అధికమయ్యాయి. టీడీపీ కేడర్‌పైనే కాకుండా సొంత పార్టీ నేతలపైనా ఆయన కక్షసాధింపులకు పాల్పడ్డారు. ఫలితంగా ముఖ్య నాయకులందరూ పార్టీకి దూరమయ్యారు. అభివృద్ధి చేయకపోగా నగరంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారన్న విమర్శలు ఉన్నాయి. దీనిని గుర్తించిన అధిష్ఠానం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న మాజీ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కాదని ఆయన అనుచరుడు డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌కు సీఎం జగన్‌ టికెట్‌ ఇచ్చింది. అయితే ఆయన ఎన్నికలకు కొత్త కావడం.. పార్టీలో వర్గ విభేదాలతో వైసీపీ శ్రేణులు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. ఖలీల్‌ అహ్మద్‌ మైనారిటీ ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాకుండా పథకాల లబ్దిదారులు మద్దతు ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వహించి అనుభవంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ వైసీపీ నాయకత్వం, శ్రేణలు చేతులెత్తేయటంతో ఖలీల్‌ గెలుపుపై ఆశలు వదులుకున్నారు. 

నియోజకవర్గ స్వరూపం..

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో 26 డివిజన్లు ఉండగా, మొత్తం 2,38,465 ఓటర్లు ఉన్నారు. దీనిలో పురుషులు 1,16,230 ఉండగా, మహిళలు 1,22,168 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 67 మంది ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది టీడపీ కూటమి వైపే చూస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !