Rahul Gandhi on NEET : నీట్‌ పేపర్‌ లీక్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు ?

0

పేపర్‌ లీక్స్‌ను ప్రధాని మోదీ అడ్డుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశార్థకంగా మారిందన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని.. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. క్వశ్చన్‌ పేపర్‌ లీక్స్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు? రాహుల్‌ అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని రాహుల్‌ అన్నారు. యూనివర్సిటీలో బీజేపీ వారిని నియమించడం వల్లే పేపర్‌ లీకులు.. సామర్థ్యం లేని వారిని వైస్‌ ఛాన్స్‌లర్లగా నియమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, యూపీలలో పేపర్‌ లీక్‌ అయ్యింది. విద్యావ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. పేపర్‌ లీక్‌ అంశం పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్షలు నిర్వహణలో విఫలమైంది. పేపర్‌ లీక్‌ చేసినవారిని కఠినంగా శిక్షించాలి’’ అని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. విద్యావ్యవస్థను డీమానిటైజేషన్‌ చేశారని.. విద్యార్థులను దెబ్బతీస్తున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్నారు. వైస్‌ ఛాన్సలర్‌ విద్యావ్యవస్థను బీజేపీ నాయకులు, వారి తల్లిదండ్రుల స్వాధీనం చేసుకోవడమే పేపర్‌ లీక్‌ కావడానికి కారణమని ఆయన ఆరోపించారు. బీహార్‌లో కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు మోసపోయారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతతో ఆడుకుంటుందన్నారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలనే ప్రశ్నపై రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. నిజాయితీపరులకు పని ఇస్తే పేపర్‌ లీక్‌ కాదన్నారు. అన్ని వైపుల నుంచి విద్యార్థులపై ఒత్తిడి ఉందని.. నిరుద్యోగం సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోడీ స్పీకర్‌ ఎంపికపై ఆందోళన చెందుతున్నారని..విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా, దేశవ్యాప్తంగా ‘నీట్‌’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నీట్‌ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు, నీట్‌ అభ్యర్థులతో ఇవాళ సాయంత్రం రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !