AP exit polls 2024 : ఆంధ్రా కింగ్‌ ఎవరు ? సర్వేల్లో ఏముంది ?

0

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్‌ తగినట్లుగానే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా.. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీ చేశారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది,  పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్‌ సహా 13 మంది పోటీలో నిలిచారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్‌ సహా 27 మంది పోటీ చేశారు.

కూటమిదే అధికారం ?

మెజారిటీ సర్వేసంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో కూటమి భారీ ఆధిక్యంతో అధికారం చేపట్టబోతోందని అంచనాలు కట్టాయి. రైజ్‌ సర్వే సంస్థ కూటమికి 113 - 125 ఇవ్వగా, వైసీపీకి 48 - 60 సీట్లు వస్తాయని లెక్క కట్టింది. చాణక్య స్టాటజీస్‌, జనగళం, పయనీర్‌, పీపుల్స్‌పల్స్‌, కేకే సర్వీసెస్‌లు కూటమి అధికారం చేపడుతుందని తెలిపాయి. 

మళ్ళీ ఫ్యాన్‌ ప్రభంజనమేనా ? 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని కొన్ని సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. వైఎస్సార్‌ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్‌ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచాయి. వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్‌ తెలిపారు. 13-15 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్‌ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 98 నుంచి 116 వరకు.. టీడీపీ 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైఎస్సార్‌సీపీకి 117  నుంచి 120.. టీడీపీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్‌ తెలిపింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !