KK Survey : చెప్పింది చెప్పినట్టు జరిగిన ఒకే ఒక సర్వే...కేకే సర్వే !

0

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న దానిపై తాజాగా పదుల సంఖ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు. కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఏకపక్ష విజయాన్ని నూటికి నూరు శాతం అంచనా వేసింది. ఎవరూ ఊహించని స్ధాయిలో కూటమి ఏకంగా 161 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది. పలు జాతీయ, లోకల్‌ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన అంచనా నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడినన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ గతంలో ఎప్పుడూ లేవు. గత ఎన్నికల్లో ఫలితాల్ని కచ్చితంగా ఊహించిన వారిలో సీపీఎస్‌, వీడీపీ అసోసియేట్స్‌ వంటి సంస్థలు ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచలేదు. అదే సమయంలో గతంలో కచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్‌ వంటి వారు కూడా వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చేసారు. ఇలాంటి పరిస్ధితుల్లో కేకే సర్వే హైదరాబాద్‌ నుంచి ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్‌ సంచలనంగా మారింది.

కేకే సర్వే  సంచలనం

ఈసారి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని కేకే సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ పోటీచేసిన 144లో 133 సీట్లు, జనసేన 21కి 21 సీట్లు, బీజేపీ 10కి 7 సీట్లు సాధిస్తుందని కేకే సర్వే వెల్లడిరచింది. ఈ అంచనాలు దాదాపుగా దాదాపు 95 శాతం పైగా నిజమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం కూటమిలో టీడీపీకి 133 సీట్లు, జనసేనకు 20 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, వైసీపీకి 15 సీట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !