CM Revanth Reddy : హరీష్‌రావే సిఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ ?

0

‘కేసీఆర్‌... మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారు. అందువల్ల భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ బతకడం, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం. కేసీఆర్‌ లేకుంటే తన సొంతలైన్‌ తీసుకోవచ్చని హరీశ్‌ ఎదురుచూస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రజలకు దగ్గరమయ్యే కోర్‌ రాజకీయాలను వదలకుండా, ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాలి. కానీ కేసీఆర్‌ ఆ పని చేయడంలేదు. హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదు. కేసీఆర్‌ పార్టీని నిలబెట్టుకొనే మూడ్‌లో లేరు. ఆయన ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో ఉండటంతో బీఆర్‌ఎస్‌ బతకడంకానీ, కేసీఆర్‌ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదు. ఈరోజు తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్‌ఎస్‌ బతుకుతుంది. పార్టీ బతికితే కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌, కవిత ఉంటారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఫినిష్‌ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావే. ఈటల రాజేందర్‌, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశే. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించి దాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటారు. అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోతే మాట్లాడేది హరీశే. అందుకే అతను వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. కేటీఆర్‌ ఎప్పుడైనా డమ్మీయే అని వ్యాఖ్యానించారు. అసలు సిఎం రేవంత్‌ రెడ్డి హరీష్‌రావును ఎందుకు టార్గెట్‌ చేశారు అనేది రాజకీయ విశ్లేషకులు పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. ఒక వేళ సిఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యాలే అయితే హరీష్‌రావు వల్ల బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గించాలి లేదా పార్టీ నుండి తప్పించాలి అనే వ్యూహంతో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే హరీష్‌రావు సొంత పార్టీ పెట్టడం లేదా బీజేపీలో చేరటమో జరుగుతుంది. కేసీఆర్‌ యాక్టివ్‌ అయితే బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ లేదంటే బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఉంటుందని చెప్పకనే చెప్పారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తేనే బలం పెరుగుతుంది అని మరో సలహా ఇచ్చారు. రెండు పార్టీలే మనుగడలో ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టమౌతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు సైతం పదవులు మాత్రమే ఉంటే సరిపోదు, అధికారం ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది అని తర్కం తెలియని వారు ఎవరూ లేరు. ఇప్పటికే 20 మందికి పైగా ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో ఉండే నాయకుల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

రాజకీయ వేధింపులు ఉండవు 

ప్రజలు...అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరు అని జగన్‌ని చూసి నేర్చుకోవాలి. అంటూనే గత కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇతర కంపెనీలకు ఊరటనిచ్చే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు సిఎం రేవంత్‌ రెడ్డి. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే ఏ ఒక్క పనీ పూర్తిచేయలేను. అన్నీ స్తంభిస్తాయి. కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా వ్యవస్థ కుప్పకూలుతుంది. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్‌ మాత్రమే ఉండరు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు ఉంటాయి. ఒకసారి కేసు నమోదైతే బ్యాంకులు వాటికి రూపాయి అప్పు ఇవ్వవు. ఓడీలను వెనక్కు తీసుకుంటాయి. అప్పులు తీర్చాలని ఒత్తిడి తెస్తాయి. అప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ప్రభుత్వంతో అంటకాగిన సంస్థలపై ఎటువంటి చర్యలు ఉండవని భరోసా ఇచ్చారు. ఒకేసారి కేసులు తెరువం, అవసరం అయితేనే తెరుస్తాం అనే వార్నింగ్‌ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !