NEET : నీట్‌ ఫలితాలపై కేంద్రం సంచలన నిర్ణయం !

0

దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష- 2024 లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌- యూజీ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని.. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న వేళ కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్ర విద్యా శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ విచారణ జరిపి.. వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని.. నీట్‌-యూజీ పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ-ఎన్‌టీఏ డీజీ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ తాజాగా మీడియాకు వెల్లడిరచారు. 

పేపర్‌ లీక్‌ కాలేదు, అవకతవకలు జరగలేదు.

ఇటీవల ఫలితాలు వెల్లడైన నీట్‌ - యూజీ పరీక్ష 2024 లో ఏకంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు కోకొల్లలుగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలోని నలుగురు సభ్యుల కమిటీ.. దీనిపై సమగ్ర విచారణ జరిపి.. వారం రోజుల్లో రిపోర్ట్‌ ఇవ్వనుందని అధికారులు పేర్కొన్నారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని ఆ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. ఆ తర్వాత వారి రిజల్ట్‌ను సవరించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే గ్రేస్‌ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించినంత మాత్రాన.. ప్రవేశాల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడదని పేర్కొన్నారు. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఖండిరచిన సుబోధ్‌ కుమార్‌ సింగ్‌.. నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ నీట్‌ యూజీ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్‌ మార్కులే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలు అని వివరించారు. అయితే వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. కమిటీ సిఫార్సులను బట్టి నిర్ణయం ఉంటుందని వెల్లడిరచారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !