Narendra Modi : మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్‌ మంత్రుల కూడా !

0

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీగా ప్రమాణం చేశారు. ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్‌ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్‌ సభ్య దేశాల ప్రతినిధులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా , శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషన్‌, సీషెల్స్‌ దేశాధినేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నటులు షారుక్‌ ఖాన్‌, రజినీకాంత్‌, ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. మొత్తంగా 72 మందితో మోదీ కేబినెట్‌ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్య్ర  మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. 

ప్రమాణం చేసిన మంత్రులు వీరే 

1.రాజనాథ్‌ సింగ్‌

2.అమిత్‌ షా

3.నితిన్‌ గడ్కరీ 

4.జేపీ నడ్డా 

5.శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 

6.నిర్మలా సీతారామన్‌ 

7.జై శంకర్‌ 

8.మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 

9.హెచ్‌డీ కుమార్‌ స్వామీ

10.పియూష్‌ గోయల్‌

11.ధర్మేద్ర ప్రధాన్‌

12.జితిన్‌ రామ్‌ మాంజీ

13.రాజీవ్‌ రంజన్‌ సింగ్‌

14.సర్వానంద్‌ సోనోవాల్‌

15.వీరేంద్రకుమార్‌

16.కింజరపు రామ్మోహన్‌ నాయుడు

17.ప్రహ్లాద్‌ జోషి

18.జువల్‌ ఓరం

19.గిరిరాజ్‌ సింగ్‌

20.అశ్వినీ వైష్ణవ్‌

21.జోతిరాధిత్య సింధియా

22.భూపేందర్‌ యాదవ్‌

23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌

24.అన్నపూర్ణాదేవి

25.కిరణ్‌ రిజిజు

26.హర్దీప్‌ సింగ్‌పూరి

27.మన్‌సుఖ్‌ మాండవీయ

28.జి.కిషన్‌ రెడ్డి

29.చిరాగ్‌ పాశ్వాన్‌ 

30.సీఆర్‌ పాటిల్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !