YS Jagan : జగన్‌కు ఏమైంది ? ఎందుకంత అభద్రతాభావం ?

0

ఏపీ అసెంబ్లీలో నిన్న వైఎస్‌ జగన్‌ తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారా అని అంతా విచిత్రంగా చూశారు. జగన్‌లో కనిపించిన మార్పేంటి? ఏం జరిగింది? నిన్న ఏపీ అసెంబ్లీ ప్రారంభమైందేగానీ.. అందరిలోనూ ఒకటే ప్రశ్న. జగన్‌ వస్తారా రారా అని. ఆయన వచ్చారు, వెళ్లారు. ఐతే.. ఆయన తీరు అందర్నీ షాకయ్యేలా చేసింది. సాధారణంగా జగన్‌లో ఆత్మన్యూనతాభావం (Inferiority Complex) ఎక్కువగా ఉంటుందనీ, అందుకే ఆయన.. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారని కొందరు చెబుతుంటారు. నిన్న జగన్‌ తీరు ఇలాగే ఉందనే టాక్‌ వినిపిస్తోంది. నిన్న జగన్‌.. అసెంబ్లీకి రావడమే వెనక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే.. అసెంబ్లీకి వచ్చే దారిలో.. అమరావతి రైతులు తనపై దాడి చేస్తారేమో అనే ఉద్దేశంతో ఆయన అలా వచ్చారనే వాదన వినిపిస్తోంది. సరే.. ఎలాగైతే వచ్చారు కదా.. అనుకుంటే.. సభలోకి హుందాగా రావాల్సిన ఆయన.. సభ ప్రారంభమైనా వెంటనే రాకుండా.. తాను ప్రమాణం చెయ్యాల్సిన టైమ్‌ వచ్చాకే వచ్చారు. వచ్చి 5 నిమిషాలు చివరి బెంచ్‌లో కూర్చున్నారు. అలాగే ప్రమాణం చేశాక.. అసెంబ్లీలో ఉండకుండా.. తన ఛాంబర్‌కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వెనక గేట్‌ నుంచే వెళ్లారు. ఇలా నిన్న జగన్‌.. అడుగడుగునా.. ఏమాత్రం కాన్ఫిడెన్స్‌ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్‌ వినిపిస్తోంది.

స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరం

మరో వైపు స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ భావించినట్టు సమాచారం. ఎన్నికైన సభాపతిని అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎప్పట్నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్‌ తిలోదకాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్‌ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్‌ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడిరచాయి. అసెంబ్లీకి హాజరు కావటం ఇష్టపడటం లేదని ఆయన ప్రవర్తనలో తెలుస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలే అజెండాగా భావించి అసెంబ్లీలో ప్రజల తరుపున పోరాడాలే కానీ పారిపోకూడదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !