Loksabha : NDAకు మద్దతు ప్రకటించిన జగన్‌ - మోదీ మార్క్‌ రాజకీయం !

0

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్‌పైన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి ఇప్పుడు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్‌ భాగస్వాములుగా ఉన్నారు. కానీ, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో తమకు పూర్తి మెజార్టీ ఉన్నా..బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. వెంటనే జగన్‌ అంగీకారం తెలిపారు. దీంతో..మోదీ వ్యూహం ఏంటనేది అంతు చిక్కటం లేదు. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది.

వైసీపీ మద్దతు

ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి లోక్‌ సభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం లోక్‌ సభ స్పీకర్‌కు ఎన్నిక అనివార్యంగా మారింది. సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. కానీ, ఈ ఎన్నికలో బీజేపీ నాయకత్వం నలుగురు సభ్యుల వైసీపీ మద్దతు కోరింది. 2019-24 వరకు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా..వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో మద్దతు లభించింది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండటంతో లోక్‌ సభలో స్పీకర్‌ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు ఎవరికి దక్కుతుందనే చర్చ సాగింది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. లోక్‌ సభలో వైసీపీ పార్టీ నేత మిథున్‌ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు చేసారు. పార్టీ అధినేత జగన్‌ తో మిథున్‌ చర్చించారు. తమ మద్దతు ఎన్డీఏకు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమకు సంఖ్య బలం ఉన్నా..తమ బలం నిరూపించుకొనేందుకు బీజేపీ ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరినట్లు కనిపిస్తోంది. అయితే, తాము జగన్‌తో రాజకీయంగా పోరాటం చేస్తూ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా.. వైసీపీ మద్దతు బీజేపీ కోరటం పైన టీడీపీ, జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా..బీజేపీ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు.

కలిసొచ్చిన స్పీకర్‌ ఎన్నిక ! 

ఓటమి నైరాశ్యంలో ఉన్న జగన్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక అనుకోని వరంగా కలిసొచ్చింది. బీజేపీ అడిగిందే తడవుగా మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఏపీలో ప్రధాని మోదీ వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పుడు వైసీపీ మద్దతు కోరటంపై కొత్త చర్చ మొదలైంది. కేంద్రంలో అధికార -విపక్ష కూటముల మధ్య నెంబర్‌ గేమ్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో స్పీకర్‌తో పాటుగా డిప్యూటీ స్పీకర్‌ను గెలుచుకోవాలనేది ప్రధాని వ్యూహగా తెలుస్తోంది. అందులో భాగంగానే కలిసొచ్చే వారి మద్దతు తీసుకుంటున్నారు. దీంతో..ఏపీలో వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. మోదీకి మద్దతు ప్రకటించి సఖ్యత కోరుకుంటున్నామని వైసీపీ చెప్పకనే చెబుతోంది. దీంతో పాటు రాజ్యసభలోనూ 11 మంది ఎంపీలు వైసీపీ ఉన్నారు. అంశాల వారీగా మద్దతు ప్రకటించేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది.  తద్వారా రాబోయే 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల మాదిరిగానే కేసుల నుండి కాపాడుకునేందుకు ఎన్డీఏ పంచన చేరుతుందనే వాదన విమర్శకులను నుండి వినిపిస్తోంది. బయటపడాలని చూస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !