పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీంతో చాలాకాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం దక్కినట్లయింది. అటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు నిర్మల తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాపై దృష్టిసారిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్‌ల అభివృద్ధికి కూడా సాయం చేస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో విశాఖ-చెన్నై-ఓర్వకల్లు-బెంగళూరు కారిడార్ కు ప్రోత్సాహం అందిస్తామన్నారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి సాయం అందిస్తామన్నారు. మరోవైపు ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధి చేపడతామని నిర్మల బడ్జెట్ లో తెలిపారు. తద్వారా విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి తగినంత ప్రయోజనం చేకూరబోతోంది.
Nirmala Sitharaman : బడ్జెట్‌లో ఏపీకి గుడ్‌న్యూస్-అమరావతికి 15 వేల కోట్లు సాయం !
జులై 23, 2024
0
Tags