NARAYANA : 180 మంది IIT, NIT అభ్యర్థులను నియమించుకున్న నారాయణ !

0

భవిష్యత్తు అవసరాల కోసం నారాయణ ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తోంది. IIT, NIT లలో అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఏరికోరి ఎంచుకుని నిష్ణాతులైన అధ్యాపకులుగా తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన విద్యను అందించేందుకు నారాయణ విద్యాసంస్థలు సిద్ధం అవుతోంది. విద్యార్థులకు అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా బోధించే ఉపాధ్యాయులను/ అధ్యాపకుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటీలలో బీటెక్‌, యంటెక్‌, యంఎసీ పూర్తి చేసిన 180 మంది ప్రతిభావంతులైన అభ్యర్థులను క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపిక చేసుకుంది నారాయణ. ‘నారాయణాస్‌ నవతరం’ పేరు మీద ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టింది. 

రేపటి అవసరాల కోసం నారాయణ నేటి సన్నద్ధత ! 

విద్యార్థులను తమ లక్ష్యాల వైపు నడిపించటంలో అధ్యాపకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది మరియు కీలకమైనది. అందుకే వివిధ దశల్లో, వివిధ ప్రక్రియల ద్వారా అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులను తయారు చేసుకుంటోంది. అన్ని ఎంట్రన్స్‌లలో అత్యంత కీలకమైన మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన 180కి పైగా అభ్యర్థులను ట్రైనీ ఫ్యాకల్టీలుగా నారాయణ రిక్రూట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా నియమించుకుంది. ప్రతిభావంతులైన నవతరం అభ్యర్థులను ప్రోత్సహించేందుకు నారాయణ విద్యాసంస్థ చొరవ తీసుకుందని నారాయణ విద్యాసంస్థల సీఈఓ పునీత్‌ కొత్తప పేర్కొన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ అభ్యర్థుల్లో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం పెంపొందిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అలాగే నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ డా॥పి.సింధూర నారయాణ మాట్లాడుతూ నారాయణ విజన్‌కు ఈ కార్యక్రమం అద్దంపడుతోందన్నారు. రాబోయే కాలంలోని అసరాలను ముందే గుర్తించి నేటి నుండే వనరులను సమకూర్చుకోవటం నారాయణ ముందు చూపుకు నిదర్శనం అన్నారు. అలాగే మరో డైరెక్టర్‌ శరణి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ముఖ్య లక్షణాలను గురించి వివరించారు మరియు నారాయణ పని వాతావరణంలో ఉండే వివిధ అంతర్భాగాలను గురించి తెలిపారు. అలాగే జైపూర్‌లోని కోచింగ్‌ సెంటర్‌ల చీఫ్‌ అకడమిక్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ అరోరా మాట్లాడుతూ రాబోయే తరాలను విజయం వైపు నడిపించాల్సిన బాధ్యత సెలక్ట్‌ అయిన అభ్యర్థులపై ఉందని గుర్తు చేశారు. చీఫ్‌ అకడమిక్‌ హెడ్‌ శ్రీమతి ప్రమీల మాట్లాడుతూ 180 మంది ట్రైనీలను నియమించుకున్నందుకు హెచ్‌ఆర్‌ బృందాన్ని అభినందించారు అలాగే నారాయణ గ్రూప్‌ విజయాల గురించి ప్రసంగించారు. రాబోయే 90 రోజుల్లో ట్రైనీ ఫ్యాకల్టీ అభ్యర్థులను తరగతి గది శిక్షణా కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నట్లు ఈ ట్రైనింగ్‌లో నారాయణ రీసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌లకు అనుగుణంగా బోధన, మైక్రోషెడ్యూల్‌ రూపకల్పన, స్టడీమెటీరియల్‌ తయారుచేయటం, ప్రశ్నాపత్రాల రూపకల్పన వంటి అంశాలపై అవగాహన కల్పించటంలో పాటు సమర్థవంతమైన శిక్షణ అందించే అధ్యాపకుడిగా మార్చడమే నారాయణ విద్యాసంస్థల ధ్యేయం అని పేర్కొన్నారు. అనంతరం నారాయణ బ్రాంచీలలో క్లాస్‌రూమ్‌ శిక్షణపై అవగాహన కల్పించడానికి 6 నెలల పాటు బ్రాంచీలకు పంపుతామని తెలిపారు. ఇది నారాయణలో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని చెప్పారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !