- పిల్లల మెరుగుదలపై వారి తల్లిదండ్రులకు నిపుణులతో అవగాహన
45 ఏళ్ళ సుదీర్ఘ విద్యాప్రస్థానంలో లక్షలాది విద్యార్థుల కలలను సాకారం చేసిన నారాయణ, ఇప్పుడు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. కేవలం చదువే కాకుండా విద్యార్థులకు ఎదురైయ్యే మానసిక సమస్యలను సమర్థవంతగా అధిగమించేలా చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా నడుచుకోవాలి ? వారి మానసిక ఆరోగాన్ని దృఢంగా ఎలా తీర్చిదిద్దాలి ? అనే అంశాలపై నిపుణులచే లోతుగా చర్చించి అవసరమైన సలహాలు, సూచనలతో యూట్యూబ్ వేదికగా మొదటి సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌ను గైడ్‌కాస్ట్ పేరుతో రీలీజ్ చేసింది నారాయణ. దీనిలో భాగంగా విద్యార్థుల మానసిక స్థితి, దానిపై ప్రభావం చూపే అంశాల గురించి లోతుగా చర్చించి వాటిని అధిగమించేందుకు విలువైన సలహాలు, సూచనలు అందించటం జరిగింది. అంతేకాకుండా విద్యార్థి రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై నిపుణుల సూచనలు అందించటం జరిగింది.
దిశా గణనీయమైన సేవలు
విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి నారాయణ దిశా కార్యక్రమాన్ని ప్రారంభించింది, 2017లో శ్రీమతి విజయలక్ష్మి నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం గణనీయమైన సేవలు అందిస్తోంది. 100 మందికి పైగా మనస్తత్వవేత్తలతో, 283 పాఠశాలలు మరియు 279 కళాశాలల్లో దిశ సేవలు అందించింది. సంవత్సరానికి 3,500 లకు పైగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలు నిర్వహించింది. గత సంవత్సరం 300,000 మంది విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. సుమారు 15,000 మందికి వ్యక్తిగతంగా సేవలు అందించింది.
నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూరనారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యాప్రమాణాల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ‘‘నారాయణలో పిల్లల అకడమిక్ పనితీరు ఎంత ముఖ్యమో వారి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని నమ్ముతున్నామని తెలిపారు. గైడ్‌కాస్ట్ అనేది ప్రతి విద్యార్థికి విద్యాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా మానసిక పరిణతికి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించటంలో ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు.
మరో డైరెక్టర్ శ్రీమతి శరణినారాయణ మాట్లాడుతూ ‘‘ఈ గైడ్‌కాస్ట్ అనేక రకాల అంశాలను గురించి అనేక కోణాల్లో చర్చించటం జరుగుతోందన్నారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండవలలసిన సంబంధబాంధవ్యాలు, భావోద్వేగ సమయంలో అందించాల్సిన మద్దతు, డిపెండెన్సీ, ఆందోళన వంటి మొదలైన అంశాలను కవర్ చేస్తుందన్నారు, అలాగే రాబోయే ఎపిసోడ్‌లలో వివిధ అంశాలను కవర్ చేయటం జరుగుతుందన్నారు. ఈ గైడ్‌కాస్ట్ తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య వారధిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా ఈ గైడ్‌కాస్ట్‌ని విని ఆచరించాలని సూచించారు.