అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2: ది రూల్’. రష్మిక కథానాయిక. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురావాలి. అయితే, డిసెంబర్ 6వ తేదీ నాటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడిరదని, దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయంటూ సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ ఊహాగానాలేనని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ జూలై ఎండిరగ్ నాటికి ముగించాలని అల్లు అర్జున్ ఆర్డర్ వేసినట్లు సమాచారం. అయితే షూటింగ్ పూర్తి కావడానికి ఇంకో నెల సమయం పడుతుందని. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ షూటింగ్ ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాకపోవడంతో అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో విసుగు చెందిన అల్లుఅర్జున్ యుఎస్‌కు చెక్కేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
తాత్కాలిక విరామమే !
అయితే ‘పుష్ప 2’ షూటింగ్‌కు వచ్చింది తాత్కాలిక విరామం మాత్రమేనని సమాచారం. ఈనెల 22 లేదా 25వ తేదీ నుంచి షూటింగ్ తిరిగి మొదలుపెడుతున్నారట. అల్లు అర్జున్ జులై 28వ తేదీ నుంచి చిత్రీకరణలో పాల్గో నున్నారు. ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌కు సంబంధించి కొంత ఎడిటింగ్ పార్ట్ పూర్తి చేసే ఉద్దేశంతో సినిమాకు కాస్త విరామం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు, సుకుమార్ వ్యక్తిగత పనుల మీద యూఎస్‌కు వెళ్లారు. ఆయనతో పాటు గీత రచయిత చంద్రబోస్ కూడా అక్కడికే వెళ్లారు. ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన చర్చలు కూడా వీరి మధ్య జరిగాయి. ప్రస్తుతం అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ తమ పర్యటనలు పూర్తి చేసుకొని తిరిగివచ్చారు. తర్వాత షెడ్యూల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌నకు తుది మెరుగులు దిద్దడంతో పాటు, కీలక సన్నివేశాలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు నాటికి మూవీని తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావురమేశ్, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.