IVF సెంటర్లలో అక్రమాలు ! ఒకటికి బదులు రెండు !!

0

ఇంట్లో పసిపిల్లలు పారాడితే చూడాలనుకునే పెద్దలు, వారి బోసి నవ్వులతో మురిసిపోవాలనుకునే జంటలు చాలామందే. ముఖ్యంగా మహిళలు అమ్మతనం కోసం ఆరాటపడుతుంటారు. కానీ, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా పెళ్ళిళ్లు ...ఇలా చాలా కారణాలు దంపతులకు సంతాన భాగ్యాన్ని దూరం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడుతోన్న వారిలో నాలుగో వంతు మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ప్రజారోగ్య సమస్యగా చూడమని ప్రభుత్వాలను కోరుతోంది. అందుకేనేమో ఏటా లక్షలమంది...సంతానంకోసం IVFని ఆశ్రయిస్తున్నారు.

వ్యాపారంగా మలుచుకున్న ఫెర్టిలిటీ సెంటర్‌లు !

సంతానం కోసం వచ్చే దంపతుల సంఖ్య పెరగటంతో ఫెర్టిలిటీ సెంటర్‌ (Fertility Centers) లు విపరీతంగా పెరిగిపోయాయి. ఫెర్టిలిటీ సెంటర్‌లలో వ్యాపారధోరణి పెరిగింది. సక్సెస్‌ రేటు కోసం డాక్టర్లు దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఫెర్టిలిటీ సెంటర్‌లను సంప్రదించే జంటలు 30 సంవత్సరాలు దాటిన వారే కావటం గమనార్హం. ఇలా పిల్లలు కావాలనే ఆశతో వచ్చిన దంపతుల బలహీనతకు చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. IVG పద్ధతిని ఉపయోగించి కృత్రిమ గర్భదారణ చేస్తున్నాయి ఫెర్టిలిటీ సెంటర్‌లు. దీని కోసం ఫెర్టిలిటీ సెంటర్‌లు రూ. 1.50 లక్షలు మొదలుకొని రూ. 2 లక్షల  దాకా వసూలు చేస్తున్నాయి. అయితే, తొలి ప్రయత్నంలోనే అందరూ గర్భం దాల్చలేరు.  కొందరిలో ఎన్నేళ్లైనా అసలు ఫలితమే ఉండకపోవచ్చు. గర్భం నిలవాలని, ఒకటికన్నా ఎక్కువ పిండాల్ని గర్భసంచిలో పెట్టడం వల్ల రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు  కవలలు పుట్టే అవకాశమూ ఉంది. అయితే, ఈ ప్రయత్నంలో శారీరక, మానసిక శ్రమతోపాటు ఐవీఎఫ్‌ విఫలమైన ప్రతిసారీ ఖర్చూ పెరుగుతుంది. అందుకే డాక్టర్లు తమ సక్సెస్‌ రేటును పెంచుకునేందుకు తల్లి గర్భంలో ఒక అండానికి బదులుగా రెండు అండాలను ప్రవేశపెడుతున్నారు. ఒక బిడ్డకు జన్మనివ్వటమే కష్టమైన సందర్భంలో ఇద్దరు బిడ్డలకు చోటు ఇవ్వటం ద్వారా గర్భిణీ స్త్రీ పై ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా గర్భం దాల్చిన మహిళ శరీరం వివిధ మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇక రెండు అండాలను ప్రవేశపెట్టడం ద్వారా గర్భిణీ స్త్రీల సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ఐవీఎఫ్‌ పద్దతి ద్వారా గర్భం దాల్చిన స్త్రీలు ప్రసవం వరకు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి.  గర్భం దాల్చిన స్త్రీలలో ఇన్‌ఫెక్షన్‌కు గురైయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.  అలాగే అధిక రక్తపోటు, ప్రీ ` ఎక్లాంప్సియా, గర్భాశయ ఆకృతుల్లో లోపాలు, శిశువు లోపాలతో ఉండటం, గర్భాశయం లేదా మావి పలుచగా ఉండటం, జెస్టేషనల్‌ డయాబెటీస్‌, హైపర్‌ టెన్షన్‌లు అటాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏమి పట్టించుకోని ఫెర్టిలిటీ సెంటర్‌లు అండాలను గర్భాశయంలో ప్రవేశపెట్టడంతో చేతులు దులుపుకుంటున్నారు. రోజులు గడిచే కొద్ది ఆరోగ్యంగా ఉన్న రెండు పిండాలు సక్సెస్‌ అయ్యి కవలలు పుడుతున్నారు. ఈ ఐవీఎఫ్‌ చికిత్స ద్వారా పిల్లలు కనాలనుకునే వారిలో 63 % మందికి గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవాలు జరగుతున్నాయి. వయస్సు తక్కువ ఆరోత్యకరంగా ఉన్న మహిళల్లో కవల పిల్లలు ప్రసవిస్తున్నారు. 35 ఏళ్ళు దాటి సమస్యలు ఉన్న మహిళల్లో రెండు అండాల కారణంగా గర్భంలో ఒకరు ఎదిగి, మరోకరు సరైన ఎదుగుదల లేకపోవటం, ఇద్దరిలో ఒకరు పుట్టుకతో లోపాలతో జన్మించటం జరుగుతోంది. కొందరు మహిళలైతే 6 లేదా 7 నెలలకే ప్రసవించటం జరుగుతోంది. అలాంటి ప్రీమెచ్యూర్‌ బేబీలను ఇంక్యుబేటర్‌లో ఉంచి వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం అందించినా కొన్ని సార్లు ప్రయోజనం ఉండటం లేదు. ఒక వైపు పిల్లలు దక్కకపోగా, మరో వైపు ఆర్థికంగా నష్టపోతున్న జంటలు కోకొల్లలు. డాక్టర్ల నిర్లక్ష్యం, సక్సెస్‌ రేటు కోసం అనవసరంగా రెండు అండాలను గర్భంలో ప్రవేశపెట్టడం కారణంగానే ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయిని పలు జంటలు ఆరోపిస్తున్నాయి. 

IVF సక్సెస్‌ రేటు తక్కువే !

భారత్‌లో IVF సక్సెస్‌ రేటు 35 ఏళ్లలోపు వారిలో 37.6 శాతం ఉండగా, 40 ఏళ్లకు పైబడిన వారిలో ఇది 12 శాతంగానే ఉందట. అంతేకాదు, సంతానలేమి సమస్యలతో బాధపడేవారు పెరగడం, ఇబ్బడిముబ్బడిగా IVF సెంటర్లు ఏర్పడటంతో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా 2021లో అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (IRT) బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 21 నుంచి యాభై ఏళ్లలోపు వారు మాత్రమే ఐవీఎఫ్‌ ద్వారా కృత్రిమ గర్భధారణకు అర్హులని ఈ యాక్ట్‌ చెబుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !