Thangalaan: తెలుగు ప్రేక్షకులు చూపే ప్రేమ అనిర్వచనీయం - విక్రమ్‌

0

చియాన్‌ విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తంగలాన్‌ సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. విక్రమ్‌కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్‌ 15 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఆగస్ట్‌ 4న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విక్రమ్‌ మాట్లాడుతూ..‘‘టీజర్‌, ట్రైలర్‌ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నా. ఎప్పుడు మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్‌ బంగారంలా అనిపిస్తోంది. తంగలాన్‌లో యాక్షన్‌, ఎమోషన్‌, మ్యాజిక్‌ అన్నీ ఉన్న అద్భుతమైన చిత్రమిది. తంగలాన్‌ వందేళ్ల క్రితం జరిగిన కథ. ఈ సినిమా కథను డైరెక్టర్‌ పా.రంజిత్‌ చెప్పినపుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. అలాగే ఈ స్టేజీ మీద నా గత సినిమాల్లోని పర్‌ఫామెన్స్‌లు చాలా చక్కగా చూపించారు. అసలు ఇపుడు అవన్నీ చూసాక చాలా ఎమోషన్‌ అయ్యాను. ఇవన్నీ నేనే చేశానా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయని చియాన్‌ విక్రమ్‌ అన్నారు. అలాగే ఈ సినిమా గురించి విక్రమ్‌ మాట్లాడుతుండగా ‘ఆస్కార్‌..ఆస్కార్‌’ అంటూ కేరింతలు కొట్టారు. ‘‘నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌తో కలిసి రెండు సినిమాలు చేశా. ప్రయత్నిద్దాం’’ అని విక్రమ్‌ నవ్వుతూ బదులిచ్చారు.  

సినిమా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది !

తంగలాన్‌ సినిమా కథా నేపథ్యం మీకు సర్‌ ప్రైజ్‌ గా ఉండాలని ఏ అంశం కూడా రివీల్‌ చేయడం లేదు. ఇది నాకు దొరికిన ది బెస్ట్‌ రోల్‌ అని అనుకుంటున్నా. మీరు థియేటర్స్‌ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్‌ తో ప్రతి ఒక్క తెలుగు ఆడియన్‌ కనెక్ట్‌ అవుతారు. మీరు తంగలాన్‌కు చూపిస్తున్న రెస్పాన్స్‌కు చాలా థ్యాంక్స్‌. ఈ నెల ఆగస్ట్‌ 15న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని విక్రమ్‌ అన్నారు.  ఇకపోతే ఈ మధ్యే రిలీజైన తంగలాన్‌ తెలుగు ట్రైలర్‌ ఆద్యంతం ఇంటెన్స్‌గా సాగింది.కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో ఎలాగైనా బంగారం తీయడానికి వచ్చిన లార్డ్‌ క్లెమెంట్‌ దొర చేసిన ఆగడాలతో ట్రైలర్‌ ఉత్కంఠ రేపుతోంది. విక్రమ్‌ లుక్స్‌, ఎదురుపడే శత్రు సైన్యంతో..విక్రమ్‌ చేసే విరించిత పోరాట సన్నివేశాలతో ట్రైలర్‌ అదిరిపోయింది.గిరిజన తెగలో ఆపద వస్తే..కరుడుగట్టిన నాయకత్వంతో ముందుకు కదిలిన విక్రమ్‌..తనదైన నటనతో ట్రైలర్‌ లో హైలెట్‌గా నిలిచింది. డైరెక్టర్‌ పా. రంజిత్‌ ట్రైలర్‌ మొత్తం ఎమోషన్స్‌తో,పోరాట సన్నివేశాలతో సాగించాడు. దీంతో తంగలాన్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ  మూవీలో పార్వతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా..మరో  కీలక పాత్రలో హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ కాల్లాగిరోన్‌ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్‌, అన్బుదురై, ప్రీతికరణ్‌ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !