Double ISMART : డబుల్‌ థిమాక్‌తో మరోసారి పూరి దుమ్మురేపుతాడా ?

0


డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ ఆయన సినిమాలకు బాగా కనెక్ట్‌ అవుతారు. పూరి సినిమాలను యూత్‌ను కట్టిపడేసే కాన్సెప్ట్‌ డైలాగ్స్‌ తో ఉంటాయి. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికి తెలుసు. రామ్‌ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. రామ్‌ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. రామ్‌ యాక్టింగ్‌తో పాటు హీరోయిన్స్‌ అందచందాలు కూడా ఈ సినిమాలు ప్లస్‌ అయ్యాయి. మొత్తంగా ఇస్మార్ట్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. 

డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ 

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ , టీజర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రామ్‌ కు జోడీగా కావ్య థాపర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. అలాగే డబుల్‌ ఇస్మార్ట్‌ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీని పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు. తాజాగా డబుల్‌ ఇస్మార్ట్‌ ట్రైలర్‌ ను విడుదల చేశారు . ఈ ట్రైలర్‌ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. మరోసారి రామ్‌ తన మాస్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ విలన్‌ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇస్మార్ట్‌ శంకర్‌ కంటే ఈ సినిమాలో మరింత యాక్షన్‌ ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌ చివరిలో ఫైట్‌ సీక్వెన్స్‌ చూపించారు. బహుశా అదే ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ అయ్యుండొచ్చు. వీటితో పాటు కావ్య తన అందాలతో ఆడియన్స్‌ ను చూపుతిప్పుకోకుండా చేసేసింది. 

ట్రైలర్‌ అదిరింది !

ట్రైలర్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ స్టొరీ లైన్‌ లోని ఒక గ్రిప్పింగ్‌ గ్లింప్స్‌ ని అందిస్తుంది. ఎక్సయిటింగ్‌, హై స్టేక్స్‌ తో కూడిన ప్లాట్‌ను రివిల్‌ చేస్తుంది. బిగ్‌ బుల్‌ సంజయ్‌ దత్‌ అమరత్వం కోసం ఓ సెన్సేషనల్‌ ఎక్స్పరిమెంట్‌ చేస్తాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ బాడీలోకి తన బ్రెయిన్‌ ని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడం అతని ప్లాన్‌. ఇది రెండు బిగ్‌ డైనమోల మధ్య ఇంటెన్స్‌ వార్‌ కి స్టేజ్‌ ని సెట్‌ చేస్తోంది. ట్రైలర్‌ అన్ని కమర్షియల్‌ హంగులతో ఆదరగొట్టింది. లవ్‌ ట్రాక్‌ యూత్‌ఫుల్‌ అయితే, మదర్‌ సెంటిమెంట్‌ మరో కీ ఎలిమెంట్‌. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్‌ మాస్‌, యాక్షన్‌ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్‌ చాలా స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా వుంది. శివలింగం వద్ద క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ మైండ్‌ బ్లోయింగ్‌ గా వుంది. రామ్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ పాత్రలో అద్భుతంగా కనిపించాడు. తన పవర్‌-ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌తో డబుల్‌ ఎనర్జీని తెచ్చాడు. సంజయ్‌ దత్‌ బిగ్‌ బుల్‌గా టెర్రిఫిక్‌ గా ఉన్నాడు. కావ్య థాపర్‌ సూపర్‌-హాట్‌గా కనిపించింది. రామ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !