Narayana : గైడ్‌కాస్ట్‌లో 2 వ ఎపిసోడ్‌ను రిలీజ్‌ చేసిన ‘నారాయణ’

0

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన నారాయణ, గైడ్‌కాస్ట్‌లోని రెండవ ఎపిసోడ్‌ను యూట్యూట్‌ వేదికగా విడుదల చేసింది. ఈ గైడ్‌కాస్ట్‌లో పిల్లల స్నేహాల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ? గొప్ప స్నేహాలు పెంపొందించటంలో తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు ? అనే అంశాలపై చర్చించటం జరిగింది. ఈ గైడ్‌కాస్ట్‌లో  ప్రముఖ సైకాలజీ నిపుణురాలు శ్రీమతి విజయలక్ష్మి తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.

శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ 

పిల్లల జీవితంలో స్నేహం పాత్రను సవివరంగా వివరించారు. స్నేహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనది. తల్లిదండ్రుల తర్వాత స్నేహితుల ప్రభావమే అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్నేహంలో చాలా భావోద్వేగాలు ఇమిడి ఉంటాయన్నారు. కౌమారదశలో భావోద్వేగాల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. యుక్తవయస్సు వచ్చేసరికి స్నేహబంధాలతో పాటు తోటి వారితోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం తెలుసుకుంటారు. కొంత మంది పిల్లలు చాలా సులభంగా స్నేహితులను ఆకర్షిస్తారు. అయితే కొందరు మాత్రం స్నేహితులను సంపాదించుకోవటంలో కష్టపడుతుంటారు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మొదట స్నేహం అనేది అవసరం ప్రాతిపదిక ఏర్పడినా సమయం గడిచే కొద్ది నమ్మకం ప్రాతిపదికన దీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. కేవలం అవసరాల కోసం ఏర్పడిన స్నేహం కొద్ది రోజుల్లోనే మసకబారుతుందన్నారు. నమ్మకం విచ్ఛిన్నమైన సందర్భాలలో స్నేహం బంధం కొనసాగకపోవచ్చు. 

పిల్లలు జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను గుర్తించండి.

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల స్నేహాల విషయంలో శ్రద్ద వహించాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపటం, వారి బలాలను అంచనా వేయటం, పిల్లలకు సురక్షితమైన మరియు భవిష్యత్తుపై భయందోళనలు లేని వాతావరణాన్ని కల్పించటంలో తల్లిదండ్రుల సహాయసహకారాలు ఎంతో అవసరం. పిల్లలు జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను గుర్తించండి. అది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. వారి ఆనందానికి మద్దతుగా నిలుస్తుంది. సురక్షితమైన మరియు అర్థవంతమైన స్నేహాలను కలిగి ఉండే వాతావరణాన్ని సృష్టించటంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైనదని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు పాడ్‌కాస్ట్‌ 2 వ ఎపిసోడ్‌ వినేయండి. 

300,000 మంది విద్యార్థులకు మద్దతు

విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి నారాయణ దిశా కార్యక్రమాన్ని ప్రారంభించింది, 2017లో  శ్రీమతి విజయలక్ష్మి (ఎం.ఏ, సైకాలజీ) ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం గణనీయమైన సేవలు అందిస్తోంది. 100 మందికి పైగా మనస్తత్వవేత్తలతో, 283 పాఠశాలలు మరియు 279 కళాశాలల్లో దిశ సేవలు అందించింది. సంవత్సరానికి 3,500 లకు పైగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలు నిర్వహించింది. గత సంవత్సరం 300,000 మంది విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. సుమారు 15,000 మందికి వ్యక్తిగతంగా సేవలు అందించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !