Pushpa -2 : పుష్ప 2 కథ లీక్‌ ? సామాజిక మాథ్యమాల్లో వైరల్‌ !

0

అసలు పుష్ప కథ ఎలా ఉంటుంది. ఎక్కడైతే కథ ముగిసిందో అక్కడ నుండే మొదలౌతుందా లేక కొత్త కథతో వస్తుందా అనే సందేహం కొందరిలో ఉంది. కానీ PUSHPA-1లో ఎక్కడైతే ముగిసిందో..అక్కడ నుండే కొనసాగుతుంది. ఇప్పుడు లీకై వైరల్‌ అవుతున్న కథ సైతం PUSHPA -1  కథకు కొనసాగింపుగానే ఉండటం ఆశ్చర్యం. PUSHPA- 2 మొదటి భాగంలో ఇంటి పేరు లేని పుష్పని హేళన చేస్తున్న అన్న అజయ్‌కి ఎలా కనువిప్పు కలిగించాడు అనే సీన్స్‌ ఎంతో ఆసక్తిగా సాగుతాయి.. పుష్ప ఇంటి పేరును ఎలా తెచ్చుకోగలిగాడు కథకే హైలెట్‌ అవుతుంది. అప్రతిహతంగా సాగుతున్న పుష్ప రూల్‌కి సడెన్‌గా బ్రేక్‌ పడుతుంది. విరామ సమయానికి అంత తల్లకిందులై పుష్ప కష్టాలు ఎదుర్కొవటం కనిపిస్తుంది. కావాలంటే మీరు ఈ స్టోరీని చదవండి.

కథలోకి వెళ్తే...

పుష్ప అన్న అజయ్‌ ఇంట్లో దొంగతనంతో మొదలైన కథ కొత్త మలుపు తీసుకుంటుంది. పుష్ప మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని షెకావత్‌ శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. పుష్ప పెళ్ళి తంతు ముగిసిన తర్వాత సాంప్రదాయంగా వస్తున్న గుడిలో పూజ చేయించుకోవాలి అనే ఆనవాయితీ ఉంటుంది. ఆ విషయాన్ని పుష్పకి చెప్తుంది వాళ్ళ అమ్మ. గుడిలోకి వెళ్ళకుండా పుష్ప అన్న అజయ్‌ అడ్డుపడతాడు. పెళ్ళి తర్వాత 16 రోజలు కదలకుండా ఇంట్లోనే ఉండాలని పుష్ప అమ్మ కోడలికి ఆర్డర్‌ వేస్తుంది. దాంతో శ్రీవల్లీ తన మాయమాటలతో 16 రోజులు ఇళ్ళు దాటకుండా తన చుట్టూనే తిప్పుకుంటుంది. (నా సామి పాట) 

పుష్ప రూలింగ్‌ !

మరోవైపు షెకావత్‌ తన సిబ్బందితో మీటింగ్‌ పెట్టి పుష్పకి సంబంధించిన అన్ని దారులు మూసివేయించి పెద్ద ఎత్తున నష్టం చేస్తాడు. దీంతో ఆగ్రహించిన పుష్ప యం.పి. రావు రమేష్‌తో చెప్పి డిజిపీతో మీటింగ్‌ పెట్టించి షెకావత్‌ దూకుడుకు కళ్ళెం వేస్తాడు. అప్పటి నుండి షెకావత్‌ ముందే పుష్ప తన వ్యాపారాన్ని ఉదృతంగా కొనసాగిస్తాడు. ఎర్రచందనం కొనే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వేలంపాట నిర్వహిస్తాడు పుష్ప, అత్యధికంగా రూ. 3 కోట్లకు అమ్ముడుపోతుంది. భార్యను పట్టించుకునే తీరిక లేకుండానే ఎప్పుడో వస్తుంటాడు. వెళ్ళిపోతుంటాడు. మరో వైపు శ్రీవల్లీ ఫ్రెండ్‌తో కేశవకి లవ్‌ ట్రాక్‌ నడుస్తుంది. మరోవైపు జాలిరెడ్డి విరిగిపోయిన నడుమును కేరళ వైద్యంతో నయం చేయించుకునే పనిలో ఉంటాడు, శ్రీవల్లీ మీద పగతో రగిలిపోతుంటాడు. దాక్షాయని అంటే భయంతో మంగళం శ్రీను వణికిపోతుంటాడు. జరిగే సంఘటనలన్నీ  దాక్షాయని ఎంతో చాకచక్యంగా డీల్‌ చేస్తుంది. తన అనుచరుల్లో ఒకడు తనని మోసం చేయాలని చూస్తే దాక్షాయని పసిగట్టి చంపేస్తుంది. కట్‌చేస్తే పుష్ప తనను పట్టించుకోవటం లేదని శ్రీవల్లీ అలుగుతుంది. బుజ్జగించటం పుష్ప వంతు అవుతుంది. ఆ తర్వాత పుష్పని అజయ్‌ ఇంట్లో దొంగతనం కేసులో ఇంటరాగేషన్‌ పేరుతో స్టేషన్‌కి పిలుస్తారు పోలీసులు. అది షెకావత్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. అజయ్‌ పుష్పనే దొంగతనం చేశాడు, వీడికి నా మీద ఎప్పటి నుండో కోపం ఉంది అని ఆరోపిస్తాడు. అజయ్‌ ఆవేశంలో ఇంట్లో అన్నీ పోయాయి. గ్రాము బంగారం కూడా, ఆస్థి పత్రాలు అందులోనే ఉన్నాయి అని మాట జారతాడు. పోయినందుకు ఆనందపడతాడు కానీ ఎక్కడో చిన్ని ఆశ వాళ్ళ నాన్న ఇచ్చిన గొలుసు దాంట్లో ఉందేమో అని. ఏ రోజున పోయిందో చెప్పండి అంటాడు కేశవ. ఆ రోజు అన్న పెళ్ళి, ఆయన ఎలా చేస్తాడు. పుష్ప అక్కడి నుండి వస్తాడు. బయటకు వస్తూ మన ఊళ్ళో దొంగతనం చేసే వాడు ఎవడ్రా అని ఆరా తీస్తాడు. అనుమానం ఉన్న వాళ్ళని ఆరా తీస్తాడు. కానీ ఎవరూ ఉండరు. కేవశకి ఓ ఐడియా ప్లాష్‌ అవుతుంది. పెళ్ళి రోజు ఒకతని చూశాను అని వాడు మన ఊరు వాడు కాదని చెప్తాడు. ఆనవాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటాడు. అతడిని వెతకటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో దొంగిలించిన సొత్తు అంతా ఓ లోయలో పడిపోయి ఉంటుంది. చెట్టుమీద భద్రంగా ఉంటుంది. అందులో దొరికిన తన తండ్రి ఇచ్చిన గొలుసు, ఆస్థి పత్రాలు అన్ని దొరకుతాయి. ఆస్థి మొత్తం పుష్ప పేరుమీదే రాసి ఉంటుంది. ఇంటి పేరుతో సహా. దానితో తన ఇంటి పేరు తిరిగివచ్చిన సందర్భంగా బాగా ఊరి అందరి మధ్య బాగా ఎమోషనల్‌ అవుతాడు. అజయ్‌ సిగ్గుతో తల దించుకుంటాడు. 

ఎంపీగా దాక్షాయని (అనసూయ) ! 

ఇంతలో ఎన్నికలు రావటం,దాక్షాయని రావురమేష్‌కి అపోజిట్‌గా నిలవటం, షెకావత్‌ సాయంతో దాక్షాయని గెలవటం చకచకా జరిగిపోతాయి. మంగళం శ్రీను మళ్ళీ యాక్టివ్‌ అవ్వటం. సిండికేట్‌ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవటం. పరిస్థితులు పుష్పకి వ్యతిరేకంగా జరుగుతున్నాయిన అర్థం అవుతుంది. అయినా తగ్గేదే లే అని ముందుకే వెళతాడు. తన వాళ్ళని టార్గెట్‌ చేస్తే ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తాడు. తన సరుకును డంప్‌లుగా మార్చేస్తాడు. పోలీసులకి ఒక్క దుంగ కూడా దొరకకుండా చేస్తాడు పుష్ప. ఎర్రచందనం కొట్టడానికి లోకల్‌గా కూలీలు రాకుండా చేస్తాడు పుష్ప. అందరూ పుష్ప మాటకి కట్టుబడిఉంటారు. తమిళనాడు నుండి కొందరిని తీసుకొచ్చి దుంగలను తరలించే ప్రయత్నం చేస్తాడు మంగళం శ్రీను Ê గ్యాంగ్‌. కానీ పుష్ప వారిని బోల్తా కొట్టించి సరుకును ఎత్తుకుపోతారు. దాక్షాయని, మంగళం శ్రీను, షెకావత్‌కి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. అహం దెబ్బ తింటుంది. షెకావత్‌ యుద్దం ప్రకటిస్తాడు. 

జైల్లో పుష్పకి థర్డ్‌ డిగ్రీ !

పుష్పకి అరెస్ట్‌ చేసి స్టేషన్‌లో బాగా కొడతాడు. శ్రీవల్లీ జైలు నుండి తప్పించి దట్టమైన అడవిలోకి తీసుకెళుతుంది. పుష్పని కాపాడుకుంటుంది. డబ్బు లేని సమయంలో,  పుష్ప కదలలేని పరిస్థితుల్లో  ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి తీసుకువస్తుంది శ్రీవల్లి.  మంగళం శ్రీను అండ్‌ గ్యాంగ్‌ పుష్పని వెతకమని పురమాయిస్తారు. కానీ దొరకడు. పుష్ప ఎర్రచందనం కొట్టే కూలీలందరితో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు. తనవైపు తిప్పుకుంటాడు. తనకి అండగా ఉండమంటాడు. ఎర్రచందనం రవాణా చేయడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తాడు. ఒకసారి ఫెయిల్‌ అవుతాడు. సరుకు పోగొట్టుకుంటాడు. అదే సమయంలో కేశవని అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తాడు షెకావత్‌. అక్కడి నుండి పెద్ద యాక్షన్‌ ప్లాన్‌తో పుష్ప కేశవని తప్పిస్తాడు. మరోవైపు ఓ కుర్రాడు తన తండ్రిని చంపిన దాక్షాయని, మంగళం శ్రీనుని చంపేందుకు రెక్కీ నిర్వహించి కేవశ కంట పడతాడు. కేశవ ఆ కుర్రాడిని పుష్ప దగ్గరకు తీసుకువస్తాడు. పగ వద్దు చదువుకో అని చెప్పాడు. నీతోనే ఉండి పని చేసుకుంటా పని ఇవ్వమని అడుగుతాడు.

మంగళం శ్రీను అండ్‌ గ్యాంగ్‌ ఎర్రచందనం రవాణా చేయడానికి షెకావత్‌ సహాయం తీసుకుంటారు. షెకావత్‌ దగ్గర ఉండి సరుకును రవాణా చేయడానికి చర్యలు తీసుకుంటాడు. తెగింపుతో ఉన్న పుష్ప షెకావత్‌ని లారీతో గుద్ది, ఎర్రచందనం తీసుకుని చెన్నె మురుగన్‌ ముందు కూర్చుంటాడు. ఆశ్చర్యపోవటం మురుగన్‌ వంతు అవుతుంది. షెకావత్‌ కూలీలకు, గ్రామస్తులకు వార్నింగ్‌ ఇస్తాడు. పుష్పకి ఎవకూ సహకరించవద్దు, చేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తాను అని చెప్తాడు. ఇంతలో శ్రీవల్లీ ప్రెగ్నెంట్‌ అని తెలుస్తుంది. ఆ వార్త జాలిరెడ్డికి తెలుస్తుంది. నాతో పడుకుని కదదా తల్లి కావాలి అని అవేశంగా చేలిలోని వస్తువులు విసిరేశాస్తాడు. పుష్పకి సహకరించే వాళ్ళందరినీ పట్టుకొస్తాడు షెకావత్‌. అందరినీ బాగా కొడతారు. ఆ వార్త జక్కారెడ్డి నుండి కేశవకి, కేశవ నుండి పుష్పకి తెలుస్తుంది. శ్రీమంతం ఫంక్షన్‌లో ఉన్న పుష్ప తన వాళ్ళని కాపాడుకోవడానికి స్టేషన్‌కి వస్తాడు. ఓ పెద్ద గోడౌన్‌లో ఉన్న తన అనుచరులు కోసం గోడ బద్దలు కొట్టుకుని వచ్చి షెకవాత్‌కి గన్‌ గురిపెడతాడు. తరువాత ఇద్దరి మధ్య ఫైటింగ్‌ మధ్యలో శ్రీవల్లీని జాలిరెడ్డి రేప్‌ చేసి చంపాడు అనే విషయం ఒక పోలీస్‌ చెప్తాడు. పుష్ప ఎమోషనల్‌గా వీక్‌ అయి విలన్స్‌కి దొరికిపోతాడు. 

శ్రీవల్లీ చేతిలో జాలిరెడ్డి చావు !

పుష్పని అక్కడే కట్టేసి షెకావత్‌ వార్నింగ్‌ ఇస్తున్న సమయంలో మరో పోలీస్‌ వచ్చి శ్రీవల్లీ చేతిలో జాలీరెడ్డి చనిపోయాడు అని వార్త తెలుస్తుంది. ఈ వార్త పుష్ప చెవిన పడుతుంది. జాలీ రెడ్డి కోసం అనసూయ, సునీల్‌, షెకావత్‌ అందరూ వెళతారు. ఇంతలో పుష్ప అండ్‌ టీమ్‌ తప్పించుకుంటుంది. జాలీరెడ్డి శవం దగ్గరకి రాగానే పుష్ప తల్పించుకున్నాడు అని షెకావత్‌కి మెసేజ్‌ వస్తుంది. అంతలో దాక్షాయని, మంగళం శ్రీను పుష్ప అమ్మను కిడ్నాప్‌ చేసి తను చెప్పిన చోటికి రమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన పుష్ప అన్ని కండీషన్స్‌కి ఓప్పుకుంటాడు. ఇంతలో అక్కడే ఉన్న 16 ఏళ్ళ కూలీ సడెన్‌గా మంగళం శ్రీను మీదకు దూకి గొడ్డలితో వేటు వేస్తాడు. మంగళం శ్రీను గిలగిలా కొట్టుకొని చస్తాడు. దాక్షాయనిని వేటాడి బ్లేడ్‌తో తన తండ్రిని చంపినట్లే చంపేస్తాడు ఆ కుర్రాడు. పుష్పనే షెకావత్‌కి కాల్‌ చేసి నా డంప్‌లన్నీ చెన్నేపోర్ట్‌కి చేరుస్తున్న, చేతనైతే ఆపుకో అని సవాల్‌ విసురుతాడు. దాంతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మొత్తాన్ని అలర్ట్‌ చేస్తాడు. కేశవ గర్ల్‌ప్రెండ్‌ను అడ్డుపెట్టుకుని కేశవతో పుష్పని చంపాలని ప్లాన్‌ చేస్తాడు షెకావత్‌. పోలీసులు చెప్పిన ప్రకారమే చేసిన కేశవ చిన్న తప్పు చేస్తాడు చివరలో అది గమనించిన పుష్ప కేశవను సృహతప్పేలా చేస్తాడు. షెకావత్‌ని అత్యంత క్రూరంగా చంపేస్తాడు. చివరగా కేశవను నీళ్ళుకొట్టి పైకిలేపి ఇంటికి వెళ్ళిపోతారు. కథ సుఖాంతం అవుతుంది. 

అయితే ఈ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే... ఓరిజినల్‌ కథకు ఏ మాత్రం తీసుపోకుండా ఈ కథను రాసేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !