
కేంద్ర వార్షిక 2025 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడిరచారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రకటించారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం కింద కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభించనున్నామన్నారు. అధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ అని, వ్యవసాయం, వీూవీజు, ఎగుమతులు, పెట్టుబడులు, ఆరు రంగాల్లో సమూల మార్పులు చేయనున్నట్లు చెప్పారు. అలాగే పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నామని, ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక రూపొందించామని మంత్రి నిర్మలమ్మ బడ్జెట్‌లో ప్రకటించారు. పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళిక ఉందని, కొత్త రకం పత్తి సాగు కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. బీహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి నిర్మలమ్మ.. అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు.
AI కి రూ. 500 కోట్లు !
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మోదీ సర్కార్ దృష్టి సారించింది.. దీనికోసం భారీగా నిధులు కేటాయించడంతోపాటు.. కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఈ మేరకు యూనియన్ బడ్జెట్ 2025-26లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భారతదేశం సాంకేతిక, విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయించారు. విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు ప్రకటించారు. ఈ చొరవ అత్యాధునిక పరిశోధనను ప్రోత్సహించడం, విద్యా రంగంలో దాని అనువర్తనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, అకాడెమియాలో AI ఆధారిత ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే యూనియన్ బడ్జెట్ 2025-26లో భాగంగా ఈ చర్య వచ్చింది. ఈ AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అధునాతన పరిశోధన, AI -ఎనేబుల్ లెర్నింగ్ టూల్స్, భవిష్యత్తులో-సన్నద్ధమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి పరిశ్రమ-అకాడెమియా సహకారంపై దృష్టి పెడుతుంది. పార్లమెంటులో ఈ చొరవను ప్రకటించిన సీతారామన్.. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను విప్లవాత్మకంగా మారుస్తోంది.. AI పరిశోధన, అనువర్తనాల్లో భారతదేశం ముందుండాలి. ప్రతిపాదిత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆవిష్కరణ, శిక్షణ, విద్యా రంగంలో AI ఆధారిత పరిష్కారాల విస్తరణకు కేంద్రంగా ఉపయోగపడుతుంది.. అంటూ పేర్కొన్నారు.