Tamannaah Breakup : తమన్నా, విజయ్‌ వర్మ లవ్‌ బ్రేకప్‌ ? ఇదిగో ఫ్రూఫ్‌ !

0

నటి తమన్నా, నటుడు విజయ్‌ వర్మ ఎంతోకాలం నుంచి రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. రెండేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. ఇకపై స్నేహితులుగానే ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయా కథనాల్లోని సారాంశం. ఇదిలాఉండగా, తమన్నా - విజయ్‌ వర్మ తమ రిలేషన్‌ను కొనసాగించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ చెవులుకొరుక్కుంటున్నారు.

అభిప్రాయభేదాలేనా !

ఈ క్రమంలోనే తాజాగా పలు కథనాలు తెరపైకి వచ్చాయి. కెరీర్‌, పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని బీటౌన్‌లో టాక్‌. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా.. పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్‌ కావాలని నిర్ణయించుకున్నారని.. విజయ్‌ వర్మ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఆయన మాత్రం ప్రస్తుతానికి కెరీర్‌ పైనే దృష్టి పెట్టాలనుకున్నారని ఈ క్రమంలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. అందుకే విడిపోయారని అనుకుంటున్నారు. 2023లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్‌ చేశారు తమన్నా, విజయ్‌ వర్మ. ఈ సిరీస్‌ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. ‘‘నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్‌వర్మ ఆ ప్రపంచంలోకి వచ్చాడు. తను నన్నెంతో అర్థం చేసుకున్నాడు. అన్ని విషయాల్లో గౌరవం ఇస్తాడు’’ అంటూ విజయ్‌పై ఇష్టాన్ని తమన్నా బయటపెట్టారు. సినిమా ఈవెంట్స్‌, ఫ్యాషన్‌ షోలు, ఇతర కార్యక్రమాలకు వీరిద్దరూ కలిసి హాజరయ్యేవారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. ఈ క్రమంలో వీరి బ్రేకప్‌ కథనాలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేశాయి. మరోవైపు, నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తలపై తమన్నా, విజయ్‌ వర్మ స్పందించలేదు. 

కుంభమేళాకు ఒంటరిగా వచ్చిన తమన్నా 

తమన్నా, విజయ్‌ వర్మ విడిపోయారనే అనుమానం చాలా రోజులుగా అభిమానులను వెంటాడుతోంది. దీనికి కారణం సోషల్‌ మీడియా. తమన్నా భాటియా, విజయ్‌ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ఉన్న ఫోటోలు షేర్‌ చేయడం ఆపేశారు. సోషల్‌ మీడియాలో ఉన్న ఫోటోలు డిలీట్‌ అయ్యాయి. ఇది ఇద్దరూ విడిపోయారనడానికి క్లారిటీ ఇస్తోంది. అంతేకాదు తమన్నా భాటియా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు, మరికొన్ని మతపరమైన ప్రదేశాలకు వెళ్లింది. కానీ ఆమెతో విజయ్‌ వర్మ లేడు. ఇది కూడా ఫ్యాన్స్‌ మైండ్‌లో అనుమానం పెరగడానికి కారణమైంది. మహాశివరాత్రి సమయంలో విజయ్‌ సద్గురు ఇషా ఆశ్రమంకి వెళ్లారు. అక్కడి శివుడి విగ్రహం వద్ద ఒంటరిగానేఫోటో దిగారు. ఇవన్నీ వీరిద్దరు విడిపోయారనే వార్తలకు బలాన్నిస్తున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !