INCOME TAX : కొత్త శ్లాబ్‌ నుండి TDS వరకు... నేటి నుంచే ఈ 6 పన్ను నియమాలు..!

0

ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దాని ప్రకారం ఈరోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026 ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో అదాయపు పన్ను మీద వరాలు కురిపించింది ప్రభుత్వం. దాని వలన కొత్త ఆర్థిక సంవత్సరంలో లెక్కలు మారనున్నాయి. 12 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు ఇప్పటి నుంచి వర్తించనుంది.  కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌, టీడీఎస్‌ లాంటి మొత్తం మారనున్నాయి. ఇందులో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి సెక్షన్‌ 87A కింద మినహాయింపు పొందడానికి ఆదాయ పరిమితిని పెంచడం ముఖ్యమైనది. ఇంతకు ముందు రూ.7 లక్షలు ఉన్న ఈ పరిమితిని ఇప్పుడు రూ. 12 లక్షల వరకూ పెంచారు. అంటే గతంలో రూ.12 లక్షల వార్షిక ఆదాయంపై రూ.80 వేల పన్ను విధించేవారు. కానీ ఇప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్‌ రూల్స్‌..

మారుతున్న నియమాలు కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్‌ల నిర్మాణాన్ని కూడా సవరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మొత్తం పన్ను విధానాలు అన్నీ ఏడు శ్లాబ్‌ లలో నిర్ణయించబడ్డాయి. రూ. 0 నుండి రూ. 24 లక్షలు, ఇంకా అంతకంటే ఎక్కువ, పన్ను అసలు లేకుండా ఉండే పరిమితి మునుపు రూ. 3 లక్షలు ఉంటే ఇప్పుడు అది రూ. 4 లక్షలకు పెరిగింది. ఇప్పుడు అత్యధిక పన్ను రేటు రూ. 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. ఇది గతంలో రూ. 15 లక్షలు ఉన్నవారికి వర్తించేది. కొత్త పన్ను శ్లాబ్‌ దీన్ని మరింత సరళీకృతం చేసే విధంగా రూపొందిచారు. ముఖ్యంగా మధ్యతరగతి ఆదాయ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దాని ప్రకారం.. కొత్త శ్లాబ్స్‌ ఇలా ఉన్నాయి. 

రూ. 0-4 లక్షలు - లేదు

రూ. 4-8 లక్షలు - 5%

రూ. 8-12 లక్షలు - 10%

రూ. 12-16 లక్షలు - 15%

రూ. 16-20 లక్షలు - 20%

రూ. 20-24 లక్షలు - 25%

రూ.24 లక్షలకు పైన - 30%

TDSలో మార్పులు

బ్యాంకు వడ్డీ, డివిడెండ్‌పై TDS పరిమితిలో కూడా సర్దుబాట్లు చేశారు. సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకు వడ్డీపై TDS పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచగా, ఇతరులకు రూ.50,000కు పెంచారు. ఇది కాకుండా, డివిడెండ్‌ ఆదాయానికి ుణూ పరిమితిని రెట్టింపు చేసి రూ.10,000కి పెంచారు. అలాగే అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 6 లక్షలకు పెంచారు. ఇక టాక్స్‌ రిటర్నస్‌కు సంబంధించి కాలపరిమితిని 12 నెలల నుంచి 48 నెలలకు పొడిగించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు భారీ జరిమానాలు లేకుండా వారి పన్నులు కట్టే వెసులుబాటు దొరుకుతుంది.  అదనంగా, ఏప్రిల్‌ 1, 2030 కి ముందు ప్రారంభించబడిన స్టార్టప్‌లు పది ఏళ్ళల్లో మూడు ఏళ్ళ పాటు లాభాలపై 100% తగ్గింపు నుండి ప్రయోజనం పొందవచ్చును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !