Shine Tom Chacko : షైన్‌ టామ్‌ చాకోపై డ్రగ్స్‌ ఆరోపణలు !

0

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్‌ పోలీసుల బృందం అక్కడ రైడ్‌ చేసింది. మలయాళ టీవీ ఛానెల్‌లలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు, షైన్‌, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు అనుచరులతో కలిసి ఒక హోటల్‌ మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి మాయమైనట్లు తెలుస్తోంది. 

హోటల్‌ నుండి పరారీ

ముందుగా మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి, ఆ స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్‌ ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి రైడ్‌ జరుగుతున్న విషయం తెలుసుకుని అతను పారిపోయినట్లు సమాచారం. కేరళ పోలీసులతో పాటు కేరళ పోలీసుల డిస్ట్రిక్ట్‌ యాంటీ నార్కోటిక్‌ స్పెషల్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రైడ్‌ చేసిన తర్వాత, షైన్‌ రూమ్‌లో ఎలాంటి అనధికార వస్తువులు దొరకలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడని, అందుబాటులోకి వచ్చిన తర్వాత అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంపై స్పందించిన షైన్‌ తల్లి మరియా, తన కొడుకు భయంతో పారిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. ‘‘నార్కోటిక్‌ అధికారులు అతని రూమ్‌లో ఏమైనా తప్పుగా కనుగొన్నారా? నాకు అతని గురించి బాగా తెలుసు. భయపడి పారిపోయి ఉండవచ్చు. పోలీసులు కూడా అక్కడికి యూనిఫామ్‌తో వెళ్లలేదు,’’ అని ఆమె ఆరోపించారు. 

అది ఓ అసహ్యకరమైన సంఘటన

మరోవైపు సినిమా సెట్‌లో డ్రగ్స్‌ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజాగా విన్సీ సోనీ అలోషియస్‌ షైన్‌ టామ్‌ చాకోపై ఫిర్యాదు చేశారు. కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘సూత్రవాక్యం’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా నటి ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మలయాళ నటుడు, ఈ మధ్యకాలంలో పలు సౌత్‌ సినిమాల్లో నటిస్తున్న షైన్‌ టామ్‌ చాకో, డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనిపై మలయాళ నటి విన్సీ, మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’కి ఫిర్యాదు చేసింది. షూటింగ్‌ సెట్‌లోనే డ్రగ్స్‌ తీసుకుని తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ నేపథ్యంలో అతని వద్ద డ్రగ్స్‌ ఉన్నాయో లేదో చెక్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులను మస్కాకొట్టి షైన్‌ తప్పించుకున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !